కేరళలో నైరుతి రుతుపవనాలు

Kerala
Kerala

హైదరాబాద్ : నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకినట్లు భారత వాతావరణ విభాగం వెల్లడించింది. నైరుతి రుతుపవనాలు కేరళకు వారం రోజుల పాటు ఆలస్యంగా చేరుకున్నాయి. రుతుపవనాల రాకతో కేరళలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ నెలఖారు నాటికి నైరుతి రుతుపవనాలు దేశమంతటా విస్తరిస్తాయి. నాలుగు నెలల పాటు నైరుతి రుతుపవనాలు కొనసాగనున్నాయి.  రుతుపవనాల రాకతో ఈ నెల 9, 10న కేరళలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న దృష్ట్యా ఐఎండీ వరుసగా నారింజ, పసుపు రంగు హెచ్చరికలను జారీ చేసింది.