ఈ ఏడాది 96 శాతం సాధారణ వర్షపాతమే..

mansoon effect
mansoon effect


హైదరాబాద్‌: 2019లో సాధారణ వర్షపాతమే ఉంటుందని వాతావరణ అంచనాలను భారత వాతావరణ శాఖ (ఐఎండి) విడుదల చేసింది. ఈ ఏడాదిలో 96 శాతం సాధారణ వర్షపాతం నమోదవుతుందని, జూన్‌ మొదటి వారంలోనే నైరుతి రుతుపవనాలు కేరళను తాకే అవకాశం ఉందని తెలిపింది. ఈ ఏడాది దేశంలో వర్షాలు మంచిగానే కురుస్తాయని ఐఎండి డైరెక్టర్‌ జనరల్‌ రమేశ్‌ తెలిపారు. పంటలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని , ప్రస్తుతం ఎండల తీవ్రత ఎక్కువగా ఉందని, ఎల్‌నినో ప్రభావం భారత్‌పై అంతగా ఉండదని తెలిపారు. ఈ ఏడాది నుంచి ఉరుములు, పిడుగుపాటు హెచ్చరికల వ్యవస్థలను ప్రారంభిస్తామని తెలిపారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/