బిజెపి ఎంపిలకు మోడి దిశానిర్దేశం

పార్లమెంటు సమావేశాలకు సరిగా హాజరు కాని మంత్రుల జాబితా సిద్ధం చేయాలని ఆదేశం
శాఖలపై పట్టు సాధించడం లేదని అసహనం
రాజకీయాలకు అతీతంగా పని చేయాలని సూచన

Modi
Modi

న్యూఢిల్లీ: ఈరోజు పార్లమెంటరీ సమావేశ జరిగింది ఈ సందర్భంగా ప్రధాని మోడి బిజెపి ఎంపిలకు దిశానిర్దేశం చేశారు. రాజకీయాలకు అతీతంగా నియోజకవర్గాల్లో ఎంపీలు పని చేయాలని చెప్పారు. అభివృద్ధి పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని ఆదేశించారు.
మరోవైపు పలువురు కేంద్ర మంత్రులపై ప్రధాని మోడి ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంటు సమావేశాల్లో రోస్టర్ డ్యూటీకి అనుగుణంగా కొందరు మంత్రులు వ్యవహరించడం లేదని ఆయన అన్నారు. వారివారి శాఖలపై కూడా పట్టు సాధించడం లేదని అసహనం వ్యక్తం చేశారు. సమావేశాలకు సరిగా హాజరుకాని మంత్రుల జాబితా సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ బాధ్యతను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషికి అప్పగించారు.


తాజా సంపాదకీయం వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/editorial