వారణాసిలో ప్రధాని మోడి విజయం

PM Modi
PM Modi

న్యూఢిల్లీ: ఎన్టీయే కూటమి భారీ విజయం దిశగా కొనసాగుతుంది. ఇప్పటికే చాలా రాష్ట్రాలో బిజెపి అధిక్యంలో ఉంది. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నుండి ప్రధాని మోడి మరోసారి విజయం సాధించారు. సమీప ఎస్పీ అభ్యర్థి షాలిని యాదవ్‌పై 4 లక్షలకు పైగా మోజార్టీతో ఆయన విజయం సాధించారు. మోడి 2014 లోక్‌సభ ఎన్నికల్లో తొలిసారిగా వారణాసి నుంచి పోటీ చేసి గెలుపొందారు. తాజా ఎన్నికల్లో మరోసారి అక్కడి నుంచి పోటీచేసి విజయం సాధించారు. కాగా.. ఈ నెల 26న మోడి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. తాజా ఎన్నికల్లో భాజపా ప్రభంజనంపై మోడి హర్షం వ్యక్తం చేశారు.


మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/