వారికి మోడి క్రమశిక్షణ తరగతులు

Modi
Modi

న్యూఢీలీ: బిజెపి పార్టీ ఎమ్మెల్యె ఆకాశ్‌ విజయ్‌ వర్గీయ అధికారులపై క్రికెట్‌ బ్యాట్‌తో దాడి చేయడాన్ని ప్రధాని నరేంద్రమోడి సీరియస్‌గా మంగళవారం జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మోదీ స్పష్టమైన సంకేతాలిచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పుడు మోడి తాజాగా పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలకు ప్రధాని మోడి క్రమశిక్షణ తరగతులు తీసుకునేందుకు సిద్ధమయ్యారట. ఈ మేరకు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ ఉదయం 80 మంది బిజెపి శాసనకర్తలతో మోడి తన అధికారిక నివాసంలో భేటీ అయినట్లు సదరు వర్గాలు పేర్కొన్నాయి. ఆకాశ్‌ను ఉదహరిస్తూ క్రమశిక్షణ పట్ల మోడి పలు సూచనలు చేయనున్నట్లు తెలుస్తోంది.


తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/