దేశాధినేతల్లో ట్విట్టర్‌కింగ్‌ ‘మోడీ

PM mode
PM mode

ఐదుకోట్లమంది అభిమానులతో మూడో స్థానం


న్యూఢిల్లీ: ప్రధాని మోడీకి ట్విట్టర్‌లో ఉన్న అభిమానులసంఖ్య లక్షల్లో పెరుగుతోంది. రానురాను ప్రధానిమోడీ ట్విట్టర్‌కింగ్‌గా పేరుతెచ్చుకుంటున్నారు. సుమారు 50 మిలియన్లు అంటే ఐదుకోట్లమందికిపైగా ఆయనకు ట్విట్టర్‌ ఫాలోవర్లు ఉన్నారని తేలింది. ప్రపంచస్థాయి నాయకుల్లో అత్యంత ఫాలోయింగ్‌ ఉన్న శక్తివంతమైన నేతగా ట్విట్టర్‌మిత్రునిగాప్రధానిమోడీ నమోదయ్యారు. ట్విట్టర్‌ హ్యాండిల్‌ అమెరికాఅధ్యక్షుడు డొనాల్డ్‌ట్రంప్‌కు వెనువెంటనే ఉన్నట్లు తెలుస్తోంది. ట్రంప్‌కు 64 మిలియన్లమందికిపైగా ఫాలోవర్లు ఉన్నారు. అమెరికా మాజీ అద్యక్షుడు బరాక్‌ ఒబామా ట్విట్టర్‌ ఫాలోవర్లలో మొదటిస్థానంలో ఉన్నారు. ఆయనకు 10.8 కోట్లమంది అనుయాయులున్నట్లు తేలింది. ప్రధాని నరేంద్రమోడీకి చేరువగా మరే ఇతర భారతీయ నాయకుడుసైతం ట్విట్టర్‌లో లేరని అంచనా. ప్రధానమంత్రి కార్యాలయంకు ఉన్న ట్విట్టర్‌ హ్యాండిల్‌లోకూడా మూడుకోట్లమంది ఫాలోవర్లు ఉన్నట్లు తేలింది. తన అనర్గళ ఉపన్యాసం చాతుర్యంతో ట్విట్టర్‌పై ఆయన అత్యంత చురుకుగా ఉంటారు. ప్రతి అంశాన్ని ఆయన ట్విట్టర్‌లోపోస్టుచేస్తుంటారు. ఆయన ఎక్కడకు వెళ్లినా ట్విట్టర్‌సాయంతోప్రజలకు చేరువగానే ఉంటారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి https://www.vaartha.com/news/national/