ఇద్దరు అగ్రదేశాల అధినేతలతో మోడి భేటి!

Narendra Modi
Narendra Modi

న్యూఢిల్లీ: భారత ప్రధానిగా మోడి మరోసారి బాధ్యతలు చేపట్టిన తరువాత మోడి చేయబోయే విదేశీ పర్యటనలు కూడా దాదాపు ఖరారయ్యాయి. ఆయన తొలి పర్యటనగా మాల్దీవులకు వెళ్లనున్నారు. అంతేకాక ఈ సంవత్సరం ఇద్దరు అగ్రదేశాల నేతలు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌లతో ఆయన రెండు సార్లు ద్వైపాక్షిక భేటీలో పాల్గొనే అవకాశముందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. సెప్టెంబరులో ఐరాస జనరల్‌ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలకు హాజరుకానున్న మోడి .. ట్రంప్‌తో ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. అయితే అంతకంటే ముందే జూన్‌ 28,29న జపాన్‌లో జరగబోయే జి20 సదస్సులోనూ వీరిద్దరూ సమావేశం కానున్నారు.
మరోవైపు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ అక్టోబరులో భారత పర్యటనకు రానున్నట్లు సమాచారం. అక్టోబరు 11న మోడి తో జిన్‌పింగ్‌ అనధికారిక భేటీలో పాల్గొనే అవకాశముందని సదరు వర్గాలు చెబుతున్నాయి. దీని కంటే ముందే జూన్‌ 13,14న కిర్గిస్థాన్‌ రాజధాని బిష్కెక్‌లో షాంఘై కోఆపరేషన్‌ ఆర్గనైజేషన్‌ సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు హాజరయ్యే మోడి తో జిన్‌పింగ్‌లో ద్వైపాక్షిక చర్చలు జరిపే అవకాశముంది.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/