మోషే హోల్ట్‌ బర్గ్‌కు మోడి ప్రత్యేక శుభాకాంక్షలు

26/11 ముంబయి దాడులో తల్లిదండ్రులను కోల్పోయిన మోషే

Narendra Modi congratulates Moshe Holtzberg
Narendra Modi congratulates Moshe Holtzberg

న్యూఢిల్లీ: మోషే హోల్ట్‌ బర్గ్‌ 26/11 ముంబయి ఉగ్రదాడుల ఘటనలో తల్లిదండ్రులను కోల్పోయిన ఇజ్రాయిల్ బాలుడు. అనాధగా మిగిలిన మోషేను ఆపై ఇజ్రాయిల్ ప్రభుత్వ చొరవతో స్వదేశానికి వెళ్లి పెరిగాడు. అయితే అతనికి ‘బార్ మిత్వా’ కార్యక్రమం జరుగుతున్న సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడి శుభాకాంక్షలు తెలిపారు. జ్యూయిష్ వర్గంలో ఓ బాలుడు 13 సంవత్సరాల వయసుకు వచ్చిన తరువాత, మత పరమైన కార్యకలాపాలు నిర్వహించేందుకు అనుమతినిస్తూ, ప్రజల మధ్య ప్రార్థనలు చేసే అనుమతిని ఇస్తూ, జరిపే సంప్రదాయ కార్యక్రమమే బార్ మిత్వా.

ఈ సందర్భంగా మోషేకు లేఖ రాసిన మోడి , భారత ప్రజలంతా నిన్న ఆశీర్వదిస్తున్నారని, నీకు దీర్ఘాయువును ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నారని అన్నారు. ‘నువ్వో అద్భుతం. ఎంతో మందికి ఆదర్శం’ అని అన్నారు. మోషే మరోసారి ముంబయి కి రావాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. కాగా, 11 సంవత్సరాల క్రితం, నవంబర్ 26న పాక్ ముష్కరమూక ముంబయిపై దాడి చేసిన వేళ, మోషే వయసు రెండు సంవత్సరాలు. నాటి దాడిలో 166 మంది చనిపోగా, 300 మందికి పైగా గాయపడ్డారన్న సంగతి తెలిసిందే.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/