రాష్ట్రపతి,ఉపరాష్ట్రపతితో మోడి భేటి

pm Narendra mody
pm Narendra mody

న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రదాడికి భారత్‌ ప్రతీకారంగా దాడి చేసిన విషయం తెలిసిందే. అయితే ఈసందర్భంగా ప్రధాని మోడి, రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఇద్దరు కూడా ఉపరాష్ట్ర వెంకయ్యనాయుడును కలిశారు. సర్జికల్‌ దాడుల వివరాలను వారికి తెలియజేశారు. అయితే సర్జికల్‌ దాడులకు సంబంధించి కేంద్రం ఈరోజు అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. సుష్మాస్వరాజ్ అధ్యక్షతన ఈ సాయంత్రం 5 గంటలకు సమావేశం జరగనుంది. వైమానిక దాడులకు సంబంధించిన అంశం.. అలాగే భారత సరిహద్దులవద్ద సైన్యాన్ని అప్రమత్తం చేయడం, ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నదానిపై ప్రధానంగా చర్చలు జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.