బిజెపి దేశ పటిష్ఠ నిర్మాణం కోసం శ్రమిస్తుంది

modi
modi

గురువాయూర్‌: ప్రధాని మోడి ఈరోజు కేరళలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. మరోసారి బిజెపికి అఖండ విజాయాన్ని కట్టబెట్టిన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిపై తనకు ఎంత ప్రేమ ఉందో కేరళపై కూడా అంతే ఉందని మోడి వ్యాఖ్యానించారు. దేశంలోని ప్రతి ప్రాంతం తనకు సమానమని తెలిపారు. అందుకే తాజా ఎన్నికల్లో కేరళ నుంచి ఒక్క బిజెపి అభ్యర్థి గెలుపొందనప్పటికీ.. తన తొలి పర్యటనకు రాష్ట్రాన్ని ఎంచుకున్నానన్నారు. బిజెపి కేవలం ఎన్నికల లబ్ధి కోసం పనిచేయడం లేదని.. దేశ పటిష్ఠ నిర్మాణం కోసం తీవ్రంగా శ్రమిస్తోందని తెలిపారు. అలాగే ఇటీవల రాష్ట్రంలో కలకలం రేకేత్తించిన నిఫా వైరస్ నియంత్రణకు కేంద్ర నుంచి తగినంత సహకారం అందిస్తామని ప్రధాని మోడి భరోసానిచ్చారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/