గతంలో ఏప్రధాని చేయలేని అభివృద్ధిని మోడి చేశారు

CM Yogi Adityanath
CM Yogi Adityanath

వారణాసి: యూపీ సిఎం, బిజెపి నాయుకుడు యోగి ఆదిత్యనాథ్‌ ఈరోజు వారణాసిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు బలహీన వర్గాల ప్రజల కోసం పోరాడుతున్న మోడికి మళ్లీ అధికారం రాకుండా చేసేందుకే ప్రతిపక్షాలు పనిచేస్తున్నాయని ఆయన ఆరోపించారు. గత ఐదేళ్లలో 24 లక్షల మంది పేదలకు ఇళ్లు నిర్మించి ఇచ్చారని, 2.6 కోట్ల మరుగుదొడ్లు నిర్మించి ఇచ్చారని అన్నారు. ఇన్ని పనులు గతంలో ఏ ప్రధానీ చేయలేదని చెప్పారు. ఆయన చేసిన అభివృద్ధిని చూసి మళ్లీ ఆయనకు ఓటు వేసి అత్యంత ఎక్కువ మెజారిటీతో గెలిపించాలని అక్కడి ప్రజలను కోరారు.ఆయన చేస్తున్న అభివృద్ధిని అడ్డుకోవడానికి ప్రతిపక్షాలన్నీ కలిసి పనిచేస్తున్నాయని యోగి మండిపడ్డారు.


మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/