వాళ్లు మమతా బెనర్జీని టార్గెట్‌ చేశారు

Mayawati
Mayawati

లక్నో: బీఎస్పీ నేత మాయావతి ఈరోజు లక్నోలో మీడియాతో మాట్లాడుతు.. బెంగాల్‌ సిఎం మమతా బెనర్జీని ప్రధానిమోడి, అమిత్‌ షా టార్గెట్‌ చేశారని ఇది పక్కా ప్రణాళి ప్రకారం జరుగుతుందని ఆమె అన్నారు. అయితే ఇది అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైంద‌ని, మంచి ప‌రిణామం కాదు అని, ఇది దేశ ప్ర‌ధానికి త‌గిన అంశం కాదు అని మాయావ‌తి అన్నారు. బెంగాల్‌లో ఎన్నిక‌ల సంఘం ప్ర‌చారాన్ని రేప‌టి నుంచి నిషేధించింద‌ని, కానీ ఇవాళ అక్క‌డ మోడి రెండు ర్యాలీలు తీస్తున్నార‌ని, మ‌రి ఇవాళ్టి నుంచి ఎందుకు ప్ర‌చారంపై నిషేధం విధించ‌లేదు అని మాయా ప్ర‌శ్నించారు. ఇది స‌రైన ప‌ద్ధ‌తి కాదు అని, మోడి క‌నుస‌న్న‌ల్లోనే ఈసీ ప‌నిచేస్తున్న‌ద‌ని మాయావతి ఆరోపించారు.


మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/