ఎయిర్‌ ఇండియా సిబ్బంది పట్ల ఎమ్మెల్యే అనుచిత ప్రవర్తన!

airindia
airindia

న్యూఢిల్లీ: విమానాశ్రయానికి ఆలస్యంగా వచ్చినందుకు ఆపిన ఎయిర్‌ఇండియా సిబ్బంది పట్ల అనుచితంగా ప్రవర్తించిన ఛత్తీస్‌గఢ్‌ మహాస్‌మండ్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే. ఎమ్మెల్యే చంద్రాకర్‌ బోర్డింగ్‌ పాస్‌ ముందుగానే తీసుకున్నారని ఎయిర్‌ఇండియా చెప్పింది. విమానం బయలుదేరే సమయానికి వెళ్లాల్సిన అయిదుగురు ప్రయాణికుల్లో ఎమ్మెల్యే చంద్రాకర్‌ కూడా ఉన్నారన్నారు. వారికోసం విమాన సిబ్బంది మళ్లీ మళ్లీ అనౌన్స్‌మెంట్‌ చేసినట్లు చెప్పారు. విమానం బోర్డింగ్‌ దగ్గర ఎమ్మెల్యే వినోద్‌ చంద్రాకర్‌ ఆపినందుకు ఆయన గట్టిగా అరిచారన్నారు. అంతేగాక సిబ్బంది గుర్తింపు కార్డు లాగేసారన్నారు. ఎమ్మెల్యే స్టేషన్‌ మేనేజర్‌తో మాట్లాడేందుకు ఫోన్‌ చేయగా, అతను ఫోన్‌ ఎత్తలేదు. తాను విమానం బయలుదేరే సమయానికన్నా ముందే వచ్చానని, సెక్యూరిటీ తన లగేజ్‌ను రెండు చోట్ల తనిఖీ చేశారని, గేటు వద్దకు తాను వెళ్లినప్పటికి సిబ్బంది తనను అడ్డుకున్నారని ఆయన ఆరోపించారు. ఈ విషయంపై విచారణ జరగాల్సి ఉందని ఎయిర్‌ఇండియా అధికార ప్రతినిధి ధనంజ§్‌ు కుమార్‌ చెప్పారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.. https://www.vaartha.com/news/national/