ఆప్‌ పార్టీకి అల్క లంబా రాజీనామా

MLA Alka Lamba
MLA Alka Lamba

న్యూఢిల్లీ: ఆప్‌ ఎమ్మెల్యె అల్క లంబా తన పార్టీకి రాజీనామా చేశారు. గత కొన్ని రోజులుగా అల్క ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై విమర్శలు గుప్పించారు. గత ఆరు సంవత్సరాల నుంచి తాను రాజకీయంగా గొప్పగా నేర్చుకున్నానని ఆమె ట్వీట్ చేశారు. అది సామాన్యుల పార్టీ కాదని బడాబాబుల పార్టీ అని అల్క ఎద్దేవా చేశారు. చాంద్నీ చౌక్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యె గా అల్క గెలుపొందారు. రెండు రోజుల క్రితం యూపిఎ చైర్మన్, కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీతో సమావేశమైన అనంతరం ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థి దశలోనే ఎన్‌ఎస్‌యుఐలో చురుకైన కార్యకర్తగా ఆమె పనిచేశారు. ఆమె చేసిన సేవలను గుర్తించిన ఆప్ పార్టీఉ 2015 ఎన్నికలలో ఆమెకు ఎంఎల్‌ఎ టికెట్ ఇచ్చింది. కేజ్రీవాల్‌పై విమర్శలు చేసిన అనంతరం ఆమెను ఆప్ వాట్సాప్ గ్రూప్ నుంచి తొలగించారు. గతంలో ఆప్ పార్టీ నుంచి ముగ్గురు ఎమ్మెల్యె బిజెపిలో చేరిన విషయం తెలిసిందే. ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 20 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో పని చేసిన అనంతరం 2013లో ఆమె ఆప్ పార్టీలో చేరారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/