గల్లంతైన ఏఎన్‌-32 విమానం ఆచూకీ లభ్యం

an-32 trasport aircraft
an-32 trasport aircraft

న్యూఢిల్లీ: ఈ నెల 3వ తేదీన గల్లంతైన భారత వైమానిక దళానికి చెందిన ఏఎన్‌-32 విమాన శకలాలను గుర్తించారు. అరుణాచల్‌ప్రదేశ్‌లోని సియాంగ్‌ జిల్లా పయూమ్‌ పరిధిలో ఇది కూలిపోయింది. భారత వైమానిక దళానికి చెందిన ఎంఐ-17 హెలికాప్టర్‌ సాయంతో విమానం ఆచూకీ కోసం వెళుతుండగా సియాంగ్‌ జిల్లాలో దీనిని గుర్తించారు.
జూన్‌ 3వ తేదీన మధ్యాహ్నం 12.25 గంటలకు అసోంలోని జోర్హాట్‌ వైమానిక స్థావరం నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే ఏఎన్‌-32 విమానం ఆచూకీ లభించలేదు. ఇందులో 8 మంది సిబ్బంది, ఐదుగురు ఇతర ప్రయాణికులతో సహా మొత్తం 13 మంది ఇందులో ప్రయాణిస్తున్నారు.

వార్త ఈ పేపర్‌ కోసం క్లిక్‌ చేయండి: https://epaper.vaartha.com/