కర్ణాటక మంత్రివర్గ విస్తరణ

  • ప్రమాణస్వీకారం చేయించిన గవర్నర్ వాజూభాయ్ వాలా
Karnataka Cabinet expansion
Karnataka Cabinet expansion

బెంగాళూరు: కర్ణాటకలో యడియూరప్ప సారథ్యంలోని బిజెపి ప్రభుత్వం ఈరోజు మంత్రివర్గ విస్తరణను చేపట్టింది. ఇండిపెండెంట్ ఎమ్మెల్యే హెచ్.నగేశ్ సహా 17 మంది కేబినెట్ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. బెంగళూరులోని రాజ్ భవన్ లో వీరందరి చేత గవర్నర్ వాజూభాయ్ వాలా ప్రమాణస్వీకారం చేయించారు. ప్రమాణస్వీకారం చేసిన వారిలో ఆర్. అశోక, జగదీశ్ షెట్టార్, మక్తప్ప కరజోల్, డాక్టర్ అశ్వర్థ్ నారాయణ్, కేఎస్ ఈశ్వరప్ప, లక్ష్మణ్ సంగప్ప సవడి, సీటీ రవి, ఎస్. సురేశ్ కుమార్, వి.సోమన్న, కోట శ్రీనివాస్ పూజారి, బసవరాజ్ బొమ్మై, ప్రభు చౌహాన్, జేసీ మధుస్వామి, చంద్రకాంత గౌడ, జె. శశికళ ఉన్నారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/