ఈ విషయంలో ప్రభుత్వాని, మోడిని మెచ్చుకోవాలి

Arun Jaitley
Arun Jaitley

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీ జైషే చీఫ్‌ మసూద్‌ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఐక్యరాజ్యసమితి ప్రకటించిన సందర్భంగా ఈరోజు ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతు దేశం గెలిచిన‌ప్పుడు, అది ప్ర‌తి భార‌తీయుడి విజ‌యం అవుతుంద‌న్నారు.మ‌సూద్ అజ‌ర్‌ను ఉగ్ర‌వాదిగా ప్ర‌క‌టించేందుకు త‌మ ప్ర‌భుత్వం తీవ్ర ప్ర‌య‌త్నం చేసింద‌న్నారు. ఈ విష‌యంలో ప్ర‌భుత్వాన్ని, ప్ర‌ధానిని మెచ్చుకోవాల‌ని జైట్లీ అన్నారు. అయితే ప్ర‌తిప‌క్షాలు మాత్రం ఈ విక్ట‌రీని పంచుకోవ‌డంలో ఇబ్బందిప‌డుతున్నాయ‌ని విమ‌ర్శించారు. అంతేకాక కేంద్ర మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ అన్నారు. మ‌సూద్‌ను గ్లోబ‌ల్ టెర్ర‌రిస్టుగా యూఎన్ ప్ర‌క‌టించ‌డం గ‌మ‌నించ‌ద‌గ్గ విష‌య‌మ‌న్నారు. విదేశాంగ శాఖ నిరంత‌రం చేప‌ట్టిన చ‌ర్య‌ల వ‌ల్లే ఇది సాధ్య‌మైంద‌ని సీతారామ‌న్ అన్నారు.


మరిన్ని తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/