ఉన్నావ్‌ బాధితురాలి వాంగ్మూలం కోసం మెజిస్ట్రేట్‌..

harassment
harassment


న్యూఢిల్లీ: ఉన్నావ్‌ లైంగికదాడి బాధితురాలి వాంగ్మూలం సేకరించేందుకు మెజిస్ట్రేట్‌ ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌)కు చేరుకున్నారు. జడ్జితో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు, బిజెపి బహిష్కృత నేత, ఎమ్మెల్యే కుల్‌దీప్‌ సింగ్‌ సెంగార్‌ కూడా ఆపసుపత్రికి వచ్చాడు. 2017లో యువతికి ఉద్యోగం ఇస్తానని చెప్పి లైంగికదాడి చేశాడు. సెంగార్‌తో పాటు అతని అనుచరుడు శశిసింగ్‌ కూడా ఆరోపణలు ఎదురొంటున్నాడు. ఈ క్రమంలో కొన్నిరోజుల క్రితం బాధితురాలు యాక్సిడెంట్‌కు గురై ప్రాణాపాయస్థితిలో ఎయిమ్స్‌కి చేరింది. ఢిల్లీ కోర్టు ఆదేశాలతో ప్రత్యేక న్యాయమూర్తి ఎయిమ్స్‌ వచ్చారు.

అక్కడే వాంగ్మూలం తీసుకునేందుకు ఏర్పాట్లు చేశారు. ఇందుకు సంబంధించి ఈ నెల 7న జిల్లా జడ్జి ధర్మేష్‌ శర్మ ఎయిమ్స్‌కు వచ్చారు. ఎయిమ్స్‌లోని జైప్రకాష్‌ నారాయణ అపెక్స్‌ ట్రామా సెంటర్‌ వద్ద ఏర్పాట్లు చేయాలని ఆయన ఆదేశించారు. న్యాయమూర్తి సూచనలతో సిబ్బంది ఏర్పాట్లు చేశారు. అయితే ఆడియో, వీడియో రికార్డింగ్‌ మాత్రం చేయవద్దని మెడికల్‌ సూపరింటెండెంట్‌ న్యాయమూర్తికి తెలిపారు. ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా చేసిన సూచనలను మెజిస్ట్రేట్‌ పరిగణనలోకి తీసుకున్నారు. సిసి కెమెరాలను ఏర్పాటు చేసి వాంగ్మూలం తీసుకోనున్నారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.. https://www.vaartha.com/news/national/