ఎయిమ్స్‌ వెళ్లిన మాయావతి

Mayawati
Mayawati

న్యూఢిల్లీ: బిఎస్పీ అధినేత్రి మాయావతి కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌ జైట్లీ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు ఎయిమ్స్‌కు వచ్చారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ నెల 9న అరుణ్‌ జైట్లీకి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో వైద్యుల సూచన మేరకు ఆయనను ఎయిమ్స్‌లో చేర్పించిన విషయం తెలిసిందే. కేంద్ర మాజీ మంత్రి రాజ్యవర్ధన్‌ సింగ్‌ రాఠోడ్‌‌, ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ బీరేంద్ర సింగ్‌ ధనోవా, భాజపా నేత సతీష్‌ ఉపాధ్యాయ్‌, కాంగ్రెస్‌ నేత అభిషేక్‌ మను సింఘ్వీ తదితరులు శనివారం ఎయిమ్స్‌కు వచ్చి జైట్లీ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు.


తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/