సూరత్‌ వస్త్ర పరిశ్రమలో అగ్నిప్రమాదం

fire accident
fire accident

సూరత్‌: గుజరాత్‌లోని సూరత్‌లో ఓ వస్త్ర పరిశ్రమలో ఈరోజు ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఉదయం ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. దాదాపు 18 అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే ఈ ఘటనలో ఎవరికైనా గాయాలయ్యాయా అన్న విషయంపై ఇంకా ఎటువంటి సమాచారం లేదు. విషయం తెలుసుకున్న పోలీసులు, ఇతర సిబ్బంది సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. అయితే దీనిపై ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/