అజర్, సయీద్, లఖ్వీ, దావూద్‌ ఉగ్రవాదులే: కేంద్రం

Azhar, Saeed, Dawood, Lakhvi
Azhar, Saeed, Dawood, Lakhvi

న్యూఢిల్లీ : నూతన ఉగ్రవాద వ్యతిరేక చట్టం ప్రకారం కరడుగట్టిన కొన్ని ఉగ్రవాద సంస్థల నాయకులను వ్యక్తిగత ఉగ్రవాదులుగా బుధవారం ప్రభుత్వం ప్రకటించింది. అలా ప్రకటించిన వారిలో జైషే మహమ్మద్ సంస్థ చీఫ్ మౌలానా మసూద్ అజర్, జమాత్ ఉద్ దవా వ్యవస్థాపకుడు హఫీజ్ మహమ్మద్ సయీద్, లష్కర్ ఎ తొయిబా క మాండర్ జకి ఉర్ రెహ్మాన్ లఖ్వీ, దేశం వదిలి పలాయనమైన దావూద్ ఇబ్రహీం ఉన్నారు. చట్టవ్యతిరేక కార్యకలాపాల(నిరోధక) స వరణ చట్టం 1967 (యుఎపిఎ) కు చేసిన కీలకమైన సవరణను పా ర్లమెంటు ఆమోదించిన దాదాపు నెల రోజుల తర్వాత ఈ నిర్ణయా లు తీసుకున్నారు. కొత్త చట్టం కింద మొదటిసారి ప్రకటించిన ఉగ్రవాదులు వీరు. దేశంలో జరిగిన అనేక ఉగ్రదాడులను ఈ సందర్భంగా ప్రభుత్వం పేర్కొంది.

పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ 2001లో జమ్మూకశ్మీర్ అసెంబ్లీ పైన, అదే ఏడాది పార్లమెంట్ , 2016లో పఠాన్‌కోట్ వైమానిక స్థావరం, 2017లో శ్రీనగర్‌లో బిఎస్‌ఎఫ్ శిబిరంపైన, ఫిబ్రవరి 14న పుల్వామా లో సిఆర్‌పిఎఫ బస్‌పైన జరిగిన దాడుల్లో అజర్ ప్రమేయం ఉంది. ఐక్యరాజ్యసమితి కూడా అజర్‌ను యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ రిజల్యూషన్ (యుఎన్‌ఎస్‌సిఆర్) 1267 కింద అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. ఖఎన్నో ఉగ్రవాద చర్యలకు పాల్పడిన మసూద్ అజర్ ఈ చట్ట ం కింది ఉగ్రవాదిగా నోటిఫై చేశాంగ అని హోం మంత్రిత్వశాఖ ఒక నోటిఫికేషన్‌లో పేర్కొంది. 2000లో ఎర్రకోటపై దాడితో సహా సయీద్‌కు వివిధ దాడులతో సంబంధం ఉంది.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/