ఎదురు కాల్పులో మావోయిస్టు మృతి

maoists
maoists

సుక్మా: ఛత్తీస్‌ఘడ్‌రాష్ట్రంలోని సుక్మా జిల్లా దబ్బకొంట ప్రాంతంలో మావోయిస్టులున్నారనే
సమాచారం తెలియడంతో ఈరోజు స్పెషల్ టాస్క్ ఫోర్స్, డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డులు, కోబ్రా జవాన్లు కలిసి ఉమ్మడిగా మావోయిస్టుల కోసం గాలింపు చేపట్టారు. జవాన్లు గాలిస్తుండగా మావోయిస్టులు కాల్పుల జరిపారు. దీంతో జవాన్లు కూడా ఎదురుకాల్పులు జరిపారు. ఈ ఎదురు కాల్పుల్లో ఓ మావోయిస్టు మరణించారు. మావోయిస్టుల కోసం గార్డుల వేట కొనసాగుతోంది.


తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/