మేనకాగాంధీ సంచలన వ్యాఖ్యలు

Maneka Gandhi
Maneka Gandhi

న్యూఢిల్లీ: ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర మహిళా, శిశు సంక్షేమ మంత్రి మేనకా గాంధీ ఈరోజు సుల్తాన్‌పూర్‌లో తురబ్‌ ఖానీ గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా  ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ముస్లింలు తనకు ఓటు వేయకుంటే వారికి ఉద్యోగాలు ఇచ్చేది లేదని అన్నారు. ఓటు వేయకుండా ఉద్యోగాలు ఎలా అడుగుతారని ప్రశ్నించారు. ఇది ఇచ్చి పుచ్చుకునే పద్ధతి అనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ‘మీ మద్దతు లేకుండా నేను ఎన్నిక కావాలనుకోవడం లేదు. పిలిభిత్‌లో నేను ఎలాంటి అభివృద్ధి పనులు చేసానో మీరు అడిగి తెలుసుకోండి. నేను సరిగా పని చేయలేదని మీరు భావిస్తే నాకు ఓటు వేయొద్దు’ అని ఆమె ముస్లింలకు సూచించారు. అయితే దీంతో మతం పేరుతో ఓట్లు అడగడం, ఉద్యోగాలివ్వమని బెదరించడం ఏమిటని విపక్షాలు అగ్గిమీదగుగ్గిల మండిపడుతున్నారు.


మరిన్ని తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌చేయండి: https://www.vaartha.com/news/national/