మోదీని బెంగాల్‌కు ఆహ్వానించా: మమత

modi mamtha
modi mamtha

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీని బెంగాల్‌కు ఆహ్వానించినట్టు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ తెలిపారు. ప్రధానితో కొద్దిసేపటి క్రితం సమావేశమైన మమతా బెనర్జీ ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. ప్రధానిని మర్యాదపూర్వకంగానే తాను కలుసుకున్నానని, తమ సమావేశం  సుహృద్భావ వాతావరణంలో  జరిగిందని చెప్పారు. బెంగాల్‌లో జరుగనున్న వాణిజ్య సదస్సు (బిజినెస్ సమ్మిట్)కు రావాల్సిందిగా ప్రధానిని ఆహ్వానించానని, అలాగే బెంగాల్ పేరును ‘బంగ్లా’గా మార్చే విషయంపై కూడా ఆయనతో మాట్లాడానని చెప్పారు.