దారితప్పిన హెలికాప్టర్‌..ఆలస్యంగా సభాస్థలికి

Mamata Banerjee
Mamata Banerjee

కోలకతా: పశ్చిమబెంగాల్‌ సిఎం మమతా బెనర్జీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ర్యాలీ కోసం ఈరోజు చోప్రాలో మమతా బెనర్జీ ప్రసంగించాల్సి ఉంది అయితే తాను వెళ్తున్న హెలికాప్టర్ దారితప్పడం ఆందోళనకు దారితీసింది. అయితే ఆ తర్వాత సరైన రూటులోకి వచ్చిన హెలికాప్టర్ అరగంట ఆలస్యంగా సభాస్థలికి చేరుకోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. మమత హెలికాప్టర్ దారితప్పిన ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు. కాగా బంగ్లాదే‌శ్‌తో సరిహద్దు పంచుకుంటున్న ప్రాంతానికి దగ్గర్లో ఉన్న చోప్రాలో మమతా బెనర్జీమధ్యాహ్నం 1.05 గంటలకు ఆమె సిలిగురిలో హెలికాప్టర్ ఎక్కారు. నార్త్ దీనజ్‌పూర్‌లోని చోప్రాకు 1.27 గంటలకు హెలికాప్టర్ చేరాల్సి ఉండగా, 2 గంటల తర్వాత అక్కడకు చేరుకుంది. బహిరగం సభలో ఈ విషయాన్ని మమత ప్రస్తావిస్తూ ‘ఆలస్యంగా వచ్చినందుకు సారీ. సభాస్థలిని పైలట్ గుర్తించలేకపోవడంతో ఆలస్యం చోటుచేసుకుంది. ఆయన డైరెక్షన్ మర్చిపోయారు. 22 నిమిషాల్లోనే నేను ఇక్కడకు చేరుకోవాల్సి ఉండగా 55 నిమిషాలు పట్టింది’ అని ఆమె తెలిపారు.


మరిన్ని తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/