బిజెపి కంచుకోటలో మమతా బెనర్జీ మార్నింగ్‌ వాక్‌

mamata banerjee
mamata banerjee

కోల్‌కతా: తమ రాష్ట్రంలో బిజెపికి ఒక్క సీటు కూడా దక్కనివ్వబోమని హూంకరించిన పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి గత పార్లమెంట్‌ ఎన్నికల ఫలితాఉల షాక్‌ను ఇచ్చాయి. దేశరాజకీయాల్లో ఫైర్‌బ్రాండ్‌గా ముద్రపడిన మమతా బెనర్జీ సాదాసీదాగా కనిపిస్తూ సాధారణ ప్రజలతో మమేకం అవుతుంటారు. ప్రస్తుం ఆమె అదే బాటలో నడుస్తున్నారు. మమతా బెనర్జీ తన వ్యూహాన్ని మార్చేసారు. తన పాత అలవాట్లు, పాత సంప్రదాయానికి తెర తీశారు. రాజధాని కోల్‌కతాకు సుమారు 600 దూరంలో ఉన్న ఒక పట్టణంలో బస చేశారు. ప శ్చిమబెంగాల్‌ ఉత్తర ప్రాంతంలోని డార్జిలింగ్‌ జిల్లాలోని కుర్సయాంగ అనే పట్టణంలో మార్నింగ్‌ వాక్‌ చేశారు. బిజెపి బలంగా ఉన్న జిల్లాల్లో డార్జిలింగ్‌ ఒకటి. మొన్నటి లోక్‌సభ ఎన్నికల సందర్భంగా డార్జిలింగ్‌ లోక్‌సభ స్ధానాన్ని కమలనాథులు కైవసం చేసుకున్నారు. ఒకప్పుడు తృణమూల్‌ కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న ఆ జిల్లాలో కాషాయ జెండా ఎగురుతోంది. ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ ఆ జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. తన పర్యటనలో భాగంగా ఆమె సుమారు ఆరు కిలోమీటర్లు కాలి నడకన కలియ తిరిగారు. తేయాకు తోటల్లో పనిచేసే మహిళా కార్మికులతో మాట్లాడారు. పాఠశాలకు వెళ్లే పిల్లలను పలకరించారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.. https://www.vaartha.com/telangana/