మమత కిమ్‌ని తలపిస్తోంది

mamata banergee
mamata banergee

పాట్నా: పశ్చిమ బెంగాల్‌ సియం మమతా బెనర్జీపై కేంద్రమంత్రి గిరిరాజ్‌ సింగ్‌ తీవ్ర స్థాయిలో స్పందించారు. సియం మమత ఉత్తర కొరియా నాయకుడు కిమ్‌ జాంగ్‌ ఉన్‌ మాదిరిగా వ్యవహరిస్తున్నారనీ, ఆమెకు పాలనకు కౌంట్‌డౌన్‌ ప్రారంభం మైందని ఆయన పేర్కొన్నారు. కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి బీహార్‌ వచ్చిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
ఓటమి భయంతో ఆమె తీవ్ర నైరాశ్యంలో మునిగిపోయారు. రాజకీయ ప్రత్యర్థులతో ఆమె వ్యవహరిస్తున్న తీరు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ను తలపిస్తుందని, ఆమె వైఖరి దేశ సమాఖ్య నిర్మాణానికి విరుద్ధంగా ఉంది. తాను మోదిని ప్రధానిగా స్వీకరించలేనని, నీతిఆయోగ్‌ సమావేశానికి కూడా రానని ఆమె చెప్పడమే దీనికి నిదర్శనం అని ఆయన పేర్కొన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/