పిఎన్‌బి ఎండిసిఇఒగా మల్లిఖార్జునరావు

MALLIKARJUNARAO
MALLIKARJUNARAOన్యూఢిల్లీ: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు కొత్త మేనేజింగ్‌ డైరెక్టర్‌గా మల్లిఖార్జునరావు నియమితులయ్యారు. 2021 సెప్టెంబరు 18వ తేదీవరకూ బ్యాంకు ఎండిగా కొనసాగుతారని డైరెక్టర్లబోర్డుప్రకటించింది. ఆయన నియామకాన్ని ప్రభుత్వం సైతం ధృవీకరించింది. దేశంలో రెండో అతిపెద్ద బ్యాంకుగా అవతరించిన పంజాబ్‌నేషనల్‌ బ్యాంకు ఇటీవలికాలంలో అనేక ఒడిదొడుకులను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. అలహాబాద్‌ బ్యాంక్‌ ఎండి సిఇఒగా వ్యవహరించిన మల్లిఖార్జునరావును ప్రభుత్వం పిఎన్‌బి ఎండిఇఇఒగా నియమించింది. 2018 సెప్టెంబరునుంచి ఆయన ఆలహాబాద్‌ బ్యాంకులోపనిచేస్తున్నారు. సిండికేట్‌బ్యాంకులో కూడా రావు 2016 సెపెంబరునుంచి ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గాపనిచేసారు. బ్యాంకులో 13వేల కోట్ల కుంభకోణంపై విచారణ,దర్యాప్తు జరుగుతున్న సమయంలో రావు బాద్యతలు స్వీకరించారు.

ఇపుడు ఆయన బ్యాంకు విలీన ంఓరియంటల్‌బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌,యునైటెడ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలను పిఎన్‌బిలో విలీన ప్రతిపాదన కూడా ఇపుడు మల్లిఖార్జునరావు హయాంలోనే పూర్తిచేయాల్సి ఉంది. ఇదిలా ఉండగా విలీనంపై చర్చించేందుకు బ్యాంకు అత్యవసరప్రత్యేక సర్వసభ్యసమావేశం వచ్చే నవంబరు 4వ తేదీ నిర్వహిస్తోంది. ప్రభుత్వం నిర్ణయించిన విలీనాలను లాంఛనంగా ఈ సమావేశంలో వాటాదారులు ఆమోదించాల్సి ఉంటుంది. ఈనెల 22వ తేదీ నిర్వహించాల్సిన సమావేశం నవంబరు నాల్గవ తేదీకి బ్యాంకు ప్రధాన కార్యాలయంలో జరుగుతుందని బోర్డు వెల్లడించింది. అలాగే బ్యాంకు ప్రభుతవంనుంచి వచ్చే 18వేలకోట్లప్రతిపాదనలను కూడా ఆమోదించాల్సి ఉంది. ఇదిలుంటే పంజాబ్‌నేషనల్‌బ్యాంకుకు గతనెల 30వ తేదీ ప్రభుత్వంనుంచి మూడువేల కోట్లు నిధులు అందాయి. ఇందుకోసం బ్యాంకు ప్రధాన్యతా కోటా కింద షేర్లను కేటాయించాలిస ఉంటుంది.
తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/news/business/