టిక్‌టాక్‌ నిషేధంపై కేంద్రానికి ఆదేశాలు జారీ

Tik Tok app
Tik Tok app

చెన్నై: టిక్‌టాక్‌ ఈ పేరు తెలియని వారు ఉండరు ఎందుకంటే ఈ యాప్‌కు ఇటీవల విపరీతమైన క్రేజ్‌ పెరిగిపోయింది. చైనాకు చెందిన ఈ యాప్‌తో వాట్సాప్‌ స్టేటస్‌లు..ఫేస్‌బుక్‌ పోస్టింగ్‌లు… ఇలా ఎక్కడ చూసిన టిక్‌టాక్‌ వీడియోలే. అయితే వీటి వల్ల అశ్లీలత పెరిగిపోతుందని , దీన్ని నిషేధించాలని ఇప్పటికే పలువురు. విజ్జప్తి చేశారు. తాజాగా మద్రాసు హైకోర్టు కూడా టిక్‌టాక్‌ను నిషేధించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని అడిగింది. టిక్‌టాక్‌పై నిషేధం విధించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ మదురైకి చెందిన సీనియర్‌ న్యాయవాది, సామాజిక కార్యకర్త ముత్తు కుమార్‌ మద్రాసు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ యాప్‌ అశ్లీలతను ప్రోత్సహిస్తోందని, దీని వల్ల కొందరు ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారని ముత్తు కుమార్‌ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం టిక్‌టాక్‌పై నిషేధం విధించాలని కేంద్రాన్ని అడిగింది. అంతేగాక.. ఈ యాప్‌ ద్వారా రూపొందించిన వీడియోలను ప్రసారం చేయరాదని మీడియాను ఆదేశించింది. చిన్నారులు సైబర్‌ నేరగాళ్ల బారిన పడకుండా నిబంధనలు తీసుకొస్తారా లేదా అన్నదానిపై ఏప్రిల్‌ 16లోగా స్పందన తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.


మరిన్ని తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/