ఫ్లెక్సీలు లేకుండా పెళ్లిళ్లు జరగవా ?

Madras High Court
Madras High Court

Chennai: అక్రమ హోర్డింగులు, బ్యానర్లపై హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫ్లెక్సీ కారణంగా యువతి మృతిపై సీరియస్ అయిన హైకోర్టు తమ ఆదేశాలను ఎందుకు అమలు చేయడం లేదని, తమిళనాడులో ఏ ప్రభుత్వం ఉన్నా ఇదే నిర్లక్ష్యమా అని ప్రశ్నించింది. ఫ్లెక్సీలు లేకుండా పెళ్లిళ్లు జరగవా అని ప్రశ్నించిన న్యాయమూర్తి బీచ్ రోడ్లో ఫ్లెక్షీలను తొలగించాలని ఆదేశించారు.