కుప్పకూలిన శిక్షణ విమానం..ఇద్దరు పైలట్లు మృతి

Aircraft Crash
Aircraft Crash

మధ్యప్రదేశ్‌: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సాగర్ జిల్లా ధనా వైమానిక కేంద్రంలో శుక్రవారం రాత్రి శిక్షణ విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లు మృతిచెందారు. దట్టమైన పొగమంచుతో రన్ వే కపిపించకపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని అధికారులు చెబుతున్నారు. మృతిచెందిన వారిలో శిక్షణ ఇస్తున్న అశోక్ మక్వానా అనే అధికారితో పాటు… ట్రైనీ పైలట్ పియూష్ చందేల్‌గా గుర్తించారు. అధికారులు ఇది ప్రమాదవశాత్తు జరిగిన ఘటనగా ధృవీకరించారు. ఇద్దరు మృతదేహాల్నిపోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన విమానం సెన్నా 172.. రాత్రిపూట ఈవిమానానికి ఎగిరే సౌకర్యాలు లేవని అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఈ విమానాన్ని కమర్షియల్ ప్రైవేట్ లైసెన్స్, ప్రైవేట్ పైలట్ లైసెన్స్ కింద నడుపుతున్నారు. దీంతో ఈ విమానం ప్రమాదంతో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని అధికారులు పరోక్షంగా చెబుతున్నారు. మరోవైపు ఈ ఘటనపై మధ్య ప్రదేశ్ సీఎం కమల్ నాథ్ స్పందించారు. మృతిచెందిన పైలట్ల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/