ట్రిపుల్ తలాక్ రద్దు బిల్లుకు లోక్‌సభ ఆమోదం

triple talaq
triple talaq

న్యూఢిల్లీ: వివాదాస్పద ట్రిపుల్ తలాక్ బిల్లును గురువారం లోక్‌సభ ప్రతిపక్షాల వాకౌట్లు, అంతకు ముందు తీవ్రస్ధాయి వాదోపవాదాల తరువాత ఆమోదించింది. బిల్లుకు అనుకూలంగా 303 మంది, వ్యతిరేకంగా 82 మంది ఎంపిలు ఓటేశారు. ట్రిపుల్ తలాక్ బిల్లుతో ము స్లిం మగవారు ట్రిపుల్ తలాక్‌కు దిగితే జైలు శిక్షకు గురి కావాల్సి ఉంటుంది. లోక్‌సభ ఆమోదం పొందిన బిల్లు రాజ్యసభలో నెగ్గాల్సి ఉంటుంది.బిల్లును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్, జెడియు, టిఎంసి సభ్యులు సభ నుంచి వాకౌట్ జరిపాయి. బిజెపి రాజకీయ అజెండాలో భాగంగానే ముస్లింలను లక్షం గా ఈ బిల్లు తీసుకువచ్చారని ప్రతిపక్షాలు విమర్శించా యి. ఇప్పుడున్న స్థితిలో బిల్లు తమకు ఆమోదయోగ్యం కాదని, సవరణలు అవసరం అని కాంగ్రెస్ స్పష్టం చేసింది. కాంగ్రెస్‌తోపాటు డిఎంకె కూడా బిల్లును స్థాయీ సంఘం పరిశీలనకు పంపించాలని డిమాండ్ చేసింది.


తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/