ఆర్టికల్‌ 370 రద్దుపై స్పందించిన అద్వానీ

ఆర్టికల్ 370 రద్దు సంతోషకరమైన విషయం

L K Advani
L K Advani

న్యూఢిల్లీ: బిజెపి సీనియర్‌ నేత అద్వానీ ఆర్టికల్‌ 370 రద్దుపై స్పందించారు. దీన్ని రద్దు చేయడం సంతోషకరమైన విషయం అని అన్నారు. అధికరణను రద్దు చేయడం బిజెపి మూల సిద్ధాంతాల్లో ఒకటని, జనసంఘ్ రోజుల నుంచే ఈ ప్రతిపాదనలు ఉన్నాయని గుర్తుచేశారు. జమ్ముకశ్మీర్ లో శాంతి, సుఖ సంతోషాల దిశగా చరిత్రాత్మక నిర్ణయం తీసుకోవడం హర్షణీయమని అన్నారు. జాతీయ సమగ్రత బలోపేతం దిశగా వేసిన ముందడుగుగా అభివర్ణించారు. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాకు అభినందనలు తెలియజేస్తున్నట్టు అద్వాణీ పేర్కొన్నారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/