సింహం పిల్లల స్మగ్లింగ్‌, ముగ్గురు అరెస్టు

cub, langurs
cub, langurs


కోల్‌కత్తా: బంగ్లాదేశ్‌ నుంచి సింహం పిల్ల, కొండముచ్చులను స్మగ్లింగ్‌ చేస్తుండగా వైల్డ్‌ లైఫ్‌ క్రైం కంట్రోల్‌ బ్యూరో అధికారులు పట్టుకున్నారు. శనివారం తెల్లవారుఝామున బంగ్లాదేశ్‌ నుంచి బల్గేరియా ఎక్స్‌ప్రెస్‌వేపై ఓ సింహం పిల్లతో పాటు, మూడు కొండముచ్చులను వాహనంలో కోల్‌కతాకు తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. అరుదైన జాతికి చెందిన సింహం పిల్లతోపాటు మూడు తెల్లరంగు కొండముచ్చులను దొంగచాటుగా వాహనంలో తరలిస్తున్నారు. సింహం పిల్లతో పాటు కొండముచ్చులను జింకల కేంద్రానికి తరలించామని, ముగ్గురు నిందితులను అరెస్టు చేశామని అధికారులు చెప్పారు.

తాజా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/latest-news/