లింగాయత్‌ మాతే మహాదేవి కన్నుమూత

Maate Mahadevi
Maate Mahadevi

బెంగాళూరు: ప్రముఖ లింగాయత్‌, బసవధర్మ పీఠం అధ్యక్షురాలు మాతే మహాదేవి (74) కన్నుమూశారు. ఆమె గతకొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అయితే మార్చి 9న ఓ ప్రయివేట్‌ ఆస్పత్రిలో చేరారు. కాగా ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతు తుదిశ్వాస విడిచినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.మహాదేవి మృతిపట్ల లింగాయత్ పెద్దలు, కులస్తులు సంతాపం ప్రకటించారు. ఆమె అంత్యక్రియలు కర్ణాటకలోని చిత్రదుర్గలో ఈరోజు జరిగాయి.


మరిన్ని తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/