టిఆర్‌ఎస్‌ తాటాకు చప్పుళ్లకు బిజెపి భయపడదు

K. Laxman
K. Laxman


దేశంలో చక్రం తిప్పడం కాదు.. ముందు తమ ఇల్లు చక్కదిద్దుకోవాలి

ఇవి దేశం కోసం జరుగుతున్న ఎన్నికలు. రాష్ట్రం కోసమో.. సీఎం పదవి కోసమో జరుగుతున్నవి

న్యూఢిల్లీ: బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు లక్మణ్‌,తెలంగాణ భాజపా నేతలు లక్ష్మణ్‌, కిషన్‌రెడ్డి, దత్తాత్రేయ బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షాను కలిసేందుకు ఈరోజు ఢిల్లీ వచ్చారు. లోక్‌సభ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపికి, ఎన్నికల సంసిద్ధత వంటి అంశాలపై చర్చించనున్నారు. ఈసందర్భంగా లక్ష్మణ్‌ మాట్లాడారు. టిఆర్‌ఎస్‌ దేశంలో చక్రం తిప్పడం కాదు.. ముందు తమ ఇల్లు చక్కదిద్దుకోవాలని ఆయన సూచించారు. టిఆర్‌ఎస్‌లో హరీశ్‌రావుకు కెటిఆర్‌, కెటిఆర్‌కు హరీశ్‌రావు పోటీగా ఉన్నారని వ్యాఖ్యానించారు.ఆ పార్టీ 16 స్థానాల్లో గెలిచినా సాధించేదేమీ లేదని, వారి తాటాకు చప్పుళ్లకు బిజెపి భయపడదని అన్నారు.తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలకు భాజపా సిద్ధమవుతోంది. మొదటి విడతలో తెలంగాణ ఎన్నికలు నిర్వహించడాన్ని స్వాగతిస్తున్నాం. 17 స్థానాల్లోనూ భాజపా పోటీ చేస్తుంది. ఇప్పటికే 14 స్థానాల్లో ఎన్నికల ప్రచారం ప్రారంభించాం. ఇవి దేశం కోసం జరుగుతున్న ఎన్నికలు. రాష్ట్రం కోసమో.. సీఎం పదవి కోసమో జరుగుతున్నవి కావు. ప్రత్యర్థుల ప్రధాని అభ్యర్థి ఎవరంటే సమాధానం లేదు. కేంద్రంలో ఎవరి సహకారం లేకుండా భాజపా అధికారంలోకి వస్తుంది. అని లక్ష్మణ్‌ అన్నారు.


మరిన్ని తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/