మృత్యుంజయులైన కవలలు

కోళికోడ్‌ విమాన ప్రమాదం బాధితుల గాథలు

Twins
Twins

తిరువనంతపురం: సమయం గడుస్తున్న కొద్దీ కేరళ కోళికోడ్‌ విమాన ప్రమాదం బాధితుల గాథలు ఒక్కోటి వెలుగుచూస్తున్నాయి.

నిపుణుడు, అనుభవజ్ఞుడైన పైలట్‌ దీపక్‌ వసంత్‌ సాథే సారథ్యంలో విమానం అదుపు తప్పడం ఒక విషాదమైతే, మరికొద్ది క్షణాల్లో సొంతగడ్డపై కాలుమోపే సమయంలో కొంతమంది ప్రయాణీకులు ప్రాణాలు కోల్పోవడం మరో విషాదం.

అయితే ఇంతటి ఘోర ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడి కవలలు మృత్యుంజయులుగా నిలిచిన వార్త కాస్త ఊరటనిస్తోంది.

ఒక పత్రిక పథకం ప్రకారం ఈ కవలలు కుటుంబం దుబా§్‌ులో నివసిస్తోంది.

తండ్రి దుబాయ్లఓనే ఉండిపోగా, తల్తి, తన నలుగురు బిడ్డలతో కలిసి వందే భారత్‌ మిషన్‌ ద్వారా కేరళకు ఎయిరిండియా విమాన టిక్కెట్లను బుక్‌ చేసుకున్నారు.

అయితే దురదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో చిక్కుకోగా, ఏడేళ్ల కవలలు జైన్‌, జమిల్‌ కుండోట్‌ పారకల్‌ ప్రాణాలతో బయటపడిన అదృష్టవంతులుగా నిలిచారు.

వీరి సోదరి, సోదరుడు కూడా స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

జియాకు (10) ఫ్రాక్చర్‌ కావడంతో ఆర్థోపెడిక్‌ విభాగంలో చికిత్స పొందుతుండగా, జియాస్‌ (14) ఆరోగ్యం నిలకడగా ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

అయితే తల్లి ఎలా ఉన్నారనేది దానిపై వివరాలు తెలియరాలేదు. దీంతో బంధువులు ఆందోళనలో పడిపోయారు.

తాజా ‘నాడి. వ్యాసాల కోసం : https://www.vaartha.com/specials/health1/