వాజ్ పేయీ వర్ధంతి.. ప్రముఖుల నివాళి

President Kovind, PM Modi
President Kovind, PM Modi

న్యూఢిల్లీ: దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయీ మొదటి వర్ధంతి సందర్భంగా సాదైవ్ అటల్ సమాధి వద్ద రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షా, పలువురు మంత్రులు నివాళులర్పించారు. వాజ్ పేయి కూతురు నమితా కౌల్ భట్టాచార్య, ఆయన మనవరాలు నిహారిక పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళుర్పించారు. భారత దేశం మొత్తం వాజ్ పేయి వర్ధంతి వేడుకలను బిజెపి కార్యకర్తలు ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా దేశానికి అటల్ చేసిన సేవలను, త్యాగాన్ని గుర్తు చేసుకున్నారు.
బిజెపి వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన వాజ్‌పేయీ గత సంవత్సరం ఆగస్టు 16న తీవ్ర అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే.


తాజా ఇ పేపరు వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://epaper.vaartha.com/