గాయని అనురాధ పౌడ్వాల్‌ మా అమ్మ

రూ.50 కోట్లు పరిహారం ఇప్పించండి

karmala modex & anuradha paudwal
karmala modex & anuradha paudwal

తిరువనంతపురం: ప్రముఖ గాయకురాలు అనురాధ పౌడ్వాల్‌ తనకు అమ్మ అంటూ కేరళకు చెందిన ఓ 45 ఏళ్ల మహిళ కోర్టును ఆశ్రయించింది. తాను పసికందుగా ఉన్నప్పుడే తన తల్లి అనురాధ తనను వదిలించుకుందుని కోర్టుకు తెలిపింది. తనను ఇన్నాళ్లుగా పొన్నచన్‌ అనే ఆమె పెంచి పోషించిందని, అయితే ఆమె కొన్నేళ్ల క్రితం మరణించిందని ఆ మహిళ తెలిపింది. ఆమె చివరి క్షణాల్లో ఈ రహస్యాన్ని తనతో చెప్పిందని తెలిపింది. తిరువనంతపురానికి చెందిన కర్మాలా మోడెక్స్‌ అనే మహిళ తాను 1974 లో అనురాధ, అరుణ్‌ పౌడ్వాల్‌ దంపతులకు పుట్టానని. అప్పట్లో గాయనిగా ఆమె బిజీగా ఉండేదని తెలిపింది. ఆ కారణంగానే తనను పొన్నచన్‌, ఆగ్నెస్‌ అనే దంపతులకు పెంచుకునేందుకు ఇచ్చేసిందని పిటిషన్‌లో కర్మాలా పేర్కొంది. అనురాధ పౌడ్వాల్‌ తనను కూతురుగా అంగీకరించాలని కోరింది. ఆమె బిడ్డగా తనకు దక్కాల్సిన జీవితం దక్కనందున ఆమె నుంచి తనకు రూ. 50 కోట్ల పరిహారం ఇప్పించాలని జిల్లా ఫ్యామిలీ కోర్టు కోరింది. కాగా జనవరి 27న అనురాధ పౌడ్వాల్‌, తన ఇద్దరు పిల్లలు విచారణకు హాజరు కావాలని న్యాయస్థానం ఆదేశించింది. అయితే ఈ విషయంపై అనురాధ పౌడ్వాల్‌ తీవ్రంగా స్పందిచారు. మూర్ఖపు ప్రకటనలపై తాను స్పందించనని ఆమె అన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/