ఇక్కడ స్కూళ్లలో మగపిల్లల చేత ప్రతిజ్ఞ

kejriwal
kejriwal

న్యూఢిల్లీ: దిశ ఘటనకు నిరసనగా దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఈ సందర్భంగా వివిధ రాష్ట్రాల సిఎంలు మహిళల భద్రతలపై ప్రత్యేకంగా దృష్టిసారించారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ సిఎం అరవింద్‌ కేజ్రివాల్‌ కూడా ఆడపిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తించబోమని అన్ని స్కూళ్లలోని మగపిల్లల చేత ప్రతిజ్ఞ చేయించాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం ఈ విషయాన్ని వెల్లడించారు. ఆడపిల్లల పట్ల ఎన్నడూ అసభ్యంగా వ్యవహరించబోమని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుకుంటున్న మగ విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించాలని తాను, ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా నిర్ణయించినట్లు ఫిక్కీ సమావేశంలో కేజ్రీవాల్ తెలిపారు. ఆడపిల్లల పట్ల దుష్ప్రవర్తనను సహించబోమని మగపిల్లలందరూ సంకల్పించాలని, అదే విధంగా బాలికలు కూడా అమ్మాయిల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించవద్దని తమ సోదరులకు చెప్పాలని ఆయన అన్నారు. ఆడపిల్లలను వేధిస్తే ఇంట్లోకి రానివ్వబోమని తల్లులు కూడా తమ కుమారులకు చెప్పాలని ఆయన సూచించారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/