ఢిల్లీ సియం అరవింద్‌ కేజ్రీవాల్‌కు బెదిరింపులు

Kejriwal
Kejriwal

న్యూఢిల్లీ: ఢిల్లీ సియం అరవింద్‌ కేజ్రీవాల్‌ను ఒక వ్యక్తి ల్యాప్‌ద్వారా బెదిరింపు మెయిల్స్‌ చేసాడు. దీంతో ఆప్‌ అధినేత సిఎం కేజ్రీవాల్‌ తనకు వచ్చిన బెదిరింపులపై సైబర్‌ సెల్‌ పోలీసులకు ఫిరాయదు చేశారు. దాంతో సైబర్‌ సెల్‌ పోలీసులు నిందితుడిని వేటాడి అదుపులోకి తీసుకున్నారు. ల్యాప్‌ద్వారా బెదిరింపు మెయిల్స్‌ చేసిన వ్యక్తి రాజస్థాన్‌లోని అజ్మీర్‌కు చెందిన వాడని, అతని మానసిక పరిస్థితి బాగోలేదని పోలీసులు చెప్పారు. అతన్ని మానసిక వైద్యుడికి చూపించిన తరువాత నివేదిక అందజేస్తామన్నారు. నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని వారు పేర్కొన్నారు. ఐపి అడ్రస్‌ ఆధారంగా సైబర్‌ నిపుణులు మోయిల్‌ చేసిన వ్యక్తిని పట్టుకున్నారు. అయితే అతని మానసిక పరిస్థితి బాగోలేదని తెలిసి విస్తుపోయారు. మెంటల్‌ కండిషన్‌ బాగాలేకపోయినా ఇటువంటి బెదిరింపు మెయిల్స్‌ చేస్తారా అని ఆశ్చర్యపోయారు. అతనికి వైద్యుల చేత కౌన్సిలింగ్‌ ఇప్పిస్తున్నట్లు చెప్పారు. అతడు మరికొందరికి కూడా ఇలా బెదిరింపు మెయిల్స్‌ పంపించాడని పోలీసులు గుర్తించారు. అతని ల్యాప్‌టాప్‌ సీజ్‌ చేశారు. అతనికి మెయిల్‌ ఐడి ఎక్కడిది, అతనే బెదిరింపు మెయిల్‌ చేస్తున్నాడా లేక ఎవరైనా అతనితో చేయిస్తున్నారా అన్న విషయాలపై సైబర్‌ పోలీసులు విచారణ జరుపుతున్నారు. మెడికల్‌ రిపోర్ట్‌ ఆధారంగా విచారణ జరుగుతుందని కూడా తెలిపారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/news/national/