కేజ్రీవాల్‌కు పరువునష్టం కేసులో బెయిల్‌

Arvind Kejriwal
Arvind Kejriwal

న్యూఢిల్లీ: ఢిల్లీ సిఎం అరవింద్‌ క్రేజీవాల్‌కు పరువు నష్టం కేసులో ఊరట లభించింది. అయితే లోక్‌సభ ఎన్నికల సమయంలో బిజెపిపై కేజ్రీవాల్‌ పలు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఓటర్ల జాబితా నుంచి బిజెపి కొందరి పేర్లు తొలగించిందని సీఎం దుయ్యబట్టారు. దీంతో సీఎం వ్యాఖ్యలపై
బిజెపి నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ పేరు ప్రతిష్ఠలకు భంగం కలిగించేలా మాట్లాడారని ఆరోపిస్తూ బిజెపి నేత రాజీవ్‌ బబ్బర్‌.. కేజ్రీవాల్‌ సహా మరి కొందరు ఆమ్‌ ఆద్మీ పార్టీ నేతలపై పరువు నష్టం దావా వేశారు. దీనిపై మెట్రోపాలిటన్‌ న్యాయస్థానంలో విచారణ జరగగా.. కేజ్రీవాల్‌ కోర్టు ఎదుట హాజరయ్యారు. ఈ కేసులో కేజ్రీవాల్‌కు న్యాయస్థానం ఊరట కల్పించింది. రూ. 10,000 వ్యక్తిగత బాండ్‌ కింద ఆయనకు బెయిల్‌ మంజూరు చేసింది.


తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/