కాలుష్య నియంత్రణకు సరి – బేసి విధానం

kejriwal
kejriwal


న్యూఢిల్లీ: రాజధానిలో ఢిల్లీలో ఆమ్‌ ఆద్మీ ప్రభుత్వం సరి-బేసి విధానాన్ని మళ్లీ అమల్లోకి తెచ్చింది. వచ్చే నెల నుంచి ఈ విధానం అమల్లోకి రానుంది. వాయు కాలుష్యాన్ని నియంత్రించడంలో భాగంగా సరి సంఖ్యలో అంతం అయ్యే రిజిస్ట్రేషన్‌ నెంబర్‌ ప్లేట్‌ ఉన్న వాహనాలను ఒకరోజు, బేసి సంఖ్యతో అంతం అయ్యే నెంబర్‌ ప్లేట్‌ ఉన్న వాహనాలను ఇంకో రోజు రోడ్లపై తిరగడానికి అనుమతి ఇస్తారు. 10 రోజుల పాటు ఈ విధానాన్ని అమలు చేసిన తరువాత వాయు కాలుష్య పరిమాణాన్ని, పరిణామాలను పరిశీలించి.. ఈ విధానాన్ని కొనసాగించాలా? వద్దా? అన్న దానిపై నిర్ణయం తీసుకుంటామని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ వెల్లడించారు. న్యూఢిల్లీలో సరి -బేసి వాహన రిజిస్ట్రేషన్ల నెంబర్ల విధానాన్ని అమల్లోకి తీసుకుని రావడం ఇది మూడోసారి. న్యూఢిల్లీలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ మాట్లాడుతూ దీపావళి పండుగ సందర్భంగా దేశ రాజధానితో పాటు పొరుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున బాణసంచా కాలుస్తారని, అందువల్ల వెలువడే పొగతో ఏర్పడే కాలుష్యాన్ని నియంత్రించడానికి సరి-బేసి వాహన రిజిస్ట్రేషన్‌ నెంబర్ద విధానాన్ని పునరుద్ధరించినట్లు తెలిపారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/news/national/