కేజ్రీవాల్‌ సర్కార్‌ సంచలన నిర్ణయం

Delhi Education Minister Manish Sisodia
Delhi Education Minister Manish Sisodia

న్యూఢిల్లీ: సంచలన నిర్ణయాలు ప్రకటిస్తూ వార్తల్లో నిలుస్తున్న ఢిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 10, 12వ తరగతి విద్యార్థుల పరీక్ష రుసుమును ఈ ఏడాదికి గాను ప్రభుత్వమే చెల్లించాలని నిర్ణయించింది. విద్యాశాఖ మంత్రి మనీశ్ సిసోడియా ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ మేరకు అన్ని పాఠశాలలకు ఆదేశాలు పంపినట్టు తెలిపారు. 10, 12వ తరగతి పరీక్ష ఫీజులను సీబీఎస్‌ఈ ఇటీవల భారీగా పెంచిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/