మోడి తరహా రాజకీయాలు.. ఢిల్లీ మీద ప్రభావం

Arvind Kejriwal
Arvind Kejriwal

న్యూఢిల్లీ: మోడి తరహా రాజకీయాలు ఢిల్లీ ప్రజల మీద కూడా ప్రభావం చూపాయని ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ అభిప్రాయపడ్డారు. వచ్చే ఏడాది ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలున్న నేపథ్యంలో ఆయన ఆప్‌ కార్యకర్తల్లో నిరాశను తొలగించే ప్రయత్నం చేశారు. దీనిలో భాగంగా కార్యకర్తలను ఉద్దేశించి ఆయన ఈరోజు ప్రెస్‌ నోట్‌ విడుదల చేశారు. పార్టీ వాలంటీర్లు పూర్తి సామర్థ్యంతో ప్రచారాన్ని అద్భుతంగా నిర్వహించారు. మన పార్టీకి చెందిన అభ్యర్థులు తగినవారని దేశ ప్రజలు భావించారు. అయితే ఫలితాలు మాత్రం ఊహించినట్లు రాలేదు. ఎన్నికల తరవాత సర్వే నిర్వహించి రెండు విషయాలు గుర్తించాం. దేశవ్యాప్తంగా ఉన్న ప్రభావమే ఢిల్లీ లోను పనిచేయడం ఒక కారణం కాగా..సార్వత్రిక ఎన్నికలు మోదీ, రాహుల్ మధ్యే అని భావించి, దానికి అనుగుణంగానే ఓటు వేయడం మరో కారణం అని కేజ్రీవాల్‌ వెల్లడించారు


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/