మహిళలు ప్లాస్టిక్‌ బిందెలతో ఆందోళన

Women worry
Women worry

చెన్నై: తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర నీటికొరతను ఎదుర్కొంటున్నారు. వారు తాగునీటి కోసం నానా కష్టాలు పడుతున్నారు. అయితే ఈక్రమంలోనే కసిమెడ, రోయపురం, ప్రాంతవాసులు తమ సమస్యను పట్టించుకోవాలని డిమాండ్‌ చేస్తూ రోడ్డెక్కారు. మహిళలు పెద్దఎత్తున ప్లాస్టిక్ బిందెలతో రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేపట్టారు. నీటి సంక్షోభాన్ని నివారించేలా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మహిళల ధర్నాతో రోడ్డుపై వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/