సుప్రీంకోర్టులో కర్ణాటక స్పీకర్‌ పిటిషన్‌

Ramesh Kumar
Ramesh Kumar

న్యూఢిల్లీ: కర్ణాటకలో అసమ్మతి ఎమ్మెల్యెల రాజీనామాలపై స్పీకర్‌ ఈరోజు సాయంత్రంలోగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికిప్పుడే నిర్ణయం తీసుకోవడం సాధ్యం కాదనీ.. రాజీనామాలను పరిశీలించేందుకు మరింత సమయం కావాలంటూ కర్నాటక స్పీకర్ కేఆర్ రమేశ్ కుమార్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. స్పీకర్ ఈరోజే నిర్ణయం తీసుకోవాలంటూ కోర్టు ఆదేశించజాలదని స్పీకర్ తరపు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదించారు. అయితే దీనిపై అత్యవసర విచారణ చేపట్టేందుకు సుప్రీం ధర్మాసనం తిరస్కరించింది. ఇప్పటికే తీర్పు వెలువరించినందున స్పీకర్ పిటిషన్‌‌ను రేపు విచారిస్తామంటూ పక్కన బెట్టింది.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/