చివరి అంకానికి చేరుకున్న కర్ణాటక రాజకీయం

cm Kumaraswamy, Speaker ramesh
cm Kumaraswamy, Speaker ramesh

బెంగళూరు: కర్ణాటక రాజీకయ సంక్షోభం చివరి అంకానికి చేరింది. ఇంకోన్ని గంటల్లో కాంగ్రెస్‌జేడీఎస్‌ సంకీర్ణ సర్కార్‌ భవితవ్యం తేలే అవకాశముంది. అయితే ఈ రోజు సాయంత్రం 6 గంటలకు ఎట్టి పరిస్థితుల్లో బలపరీక్షను నిర్వహించాలనే పట్టుదలతో ఉన్న స్పీకర్‌ సభను నిరంతరాయంగా కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం విధాన సభలో విశ్వాస పరీక్షపై కొనసాగుతున్న చర్చలో సీఎల్పీ నేత సిద్ధరామయ్య మాట్లాడుతున్నారు. అసెంబ్లీకి వచ్చినా ఇప్పటివరకూ తన ఛాంబర్‌లోనే ఉన్న ముఖ్యమంత్రి కుమారస్వామి సభలోకి వచ్చారు. సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి కుమారస్వామి మాట్లాడేందుకు స్పీకర్‌ అవకాశం ఇచ్చారు. గంటపాటు కుమార స్వామి ప్రసంగించే అవకాశం ఉంది. సాయంత్రం 5 గంటల తర్వాత ఓటింగ్ ప్రక్రియ జరగనుంది.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/