గోవాకు వెళ్లనున్న అసమ్మతి ఎమ్మెల్యెలు?

14 Karnataka MLAs
14 Karnataka MLAs

బెంగళూరు: కర్ణాటకలో రాజీనామా చేసిన 14 మంది ఎమ్మెల్యేలను బుజ్జగించే ప్రయత్నాలు ఇంకా ఫలించలేదు. మరోవైపు రాజీనామా చేసి ముంబయిలో తిష్ఠ వేసిన అసమ్మతి ఎమ్మెల్యేలు ఈరోజు గోవా వెళ్లనున్నాఉ. అయితే అసమ్మతి ఎమ్మెల్యేలంతా బిజెపి ముంబయి యువ మోర్చా అధ్యక్షుడు మోహిత్‌ భార్టియాతో కలిసి రోడ్డు మార్గం గుండా గోవా వెళ్తారని తొలుత వార్తలు వచ్చాయి. కాగా న్న సాయంత్రం ముంబయి హోటల్‌ను ఖాళీ చేసిన రెబల్‌ ఎమ్మెల్యేలు పుణె వెళ్లారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో నేడు గోవా చేరుకోనున్నారు. గోవాలో ఓ రిసార్ట్‌లో ఎమ్మెల్యేలు బస చేయనున్నట్లు తెలుస్తోంది. వారి కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు గోవాకు చెందిన ఓ బిజెపి నేత మీడియాకు తెలిపారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/