రాజీనామాను ఉపసంహరించుకున్న రామలింగారెడ్డి

సంకీర్ణ ప్రభుత్వానికి ఊరట 

MLA Ramalinga Reddy
MLA Ramalinga Reddy

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీలో ఈరోజు ఉదయం 11 గంటలకు బల పరీక్ష ఉంది. ఈ నేపథ్యంలో సంకీర్ణ ప్రభుత్వానికి ఊరట లభించింది. కాంగ్రెస్‌ అసమ్మతి ఎంఎల్ఎ రామలింగారెడ్డి తన రాజీనామాను ఉపసంహరించుకున్నారు. సంకీర్ణ ప్రభుత్వానికే తాను మద్దతిస్తానని రామలింగారెడ్డి కూడా ప్రకటించడంతో కుమార స్వామి ప్రభుత్వానికి కాసింత ఊరట లభించింది. ఈ ఉదయం 11గంటలకు అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగనుంది. అనంతరం సంకీర్ణ ప్రభుత్వం తమ ఆధిక్యాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది. అసెంబ్లీలో మొత్తం 224 మంది ఎంఎల్ఎలు ఉన్నారు. 16 మంది ఎంఎల్ఎలు రాజీనామా చేయడం ఆ సంఖ్య 209 కి పడిపోయంది. బల నిరూపణకు అవసరమైన మేజిక్ ఫిగర్ 205. రెబల్ ఎంఎల్ఎల రాజీనామాతో కుమార స్వామి ప్రభుత్వ బలం 102కి పడిపోయింది. అంతేకాదు స్పీకర్ ది నిర్ణయాత్మక ఓటు కావడంతో ప్రభుత్వం 101కు పరిమితమైంది. ఇదిలా ఉండగా బిజెపికి సభలో 105 మంది ఎంఎల్ఎలు ఉన్నారు. బిజెపికి ఇద్దరు ఇండిపెండెంట్ ఎంఎల్ఎలు కూడా మద్దతు తెలుపుతున్నారు. దీంతో బిజెపి ఎంఎల్ఎల సంఖ్య 107కి చేరింది. అయిత బలనిరూపణలో కుమారస్వామి ప్రభుత్వం విఫలం కావడం ఖాయమని, తామే అధికారంలోకి వస్తామని బిజెపి నేతలు ఆశతో ఉన్నారు.


తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/